ఫిబ్రవరి నెలలో వారానికోసారి రాగి లడ్డు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంగన్వాడీ కేంద్రాలలో హాజరు శాతం పెంపొందించేందుకు జిల్లాలో ఫిబ్రవరి – 2024 మాసంలో ప్రయోగాత్మకంగా రాగి లడ్డూల పంపిణీని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.ఈ నెలలో వారానికి ఒకసారి రాగి లడ్డూలను విద్యార్థులకు పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారులకు, ఎనిమియాతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలకు అందివ్వనున్నట్లు తెలిపారు.

 Ragi Laddu Weekly In The Month Of February, Ragi Laddu , Rajanna Sircilla Distri-TeluguStop.com

ఈ నెలలో వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి మునుముందు కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

పోతుగల్ అంగన్వాడీ కేంద్ర పనితీరును పరిశీలించిన అదనపు కలెక్టర్.

జిల్లా అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి శనివారం ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి కృత్యాధార బోధనను పరిశీలించారు.

వారి ప్రగతిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే పోషణ లోపంతో బాధపడుతున్న పిల్లలకి,

అనిమియాతో బాధపడుతున్న గర్భిణీలకు, బాలింతలకు ప్రత్యేకంగా రాగి లడ్డూలు తయారు చేయించి ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారులు హాజరు అవ్వడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పి లక్ష్మీరాజం జిల్లా సంక్షేమ అధికారికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు.

అలాగే ఈ కార్యక్రమంలో సిడిపివోలు ఏ సిడిపివోలు సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పోసిన అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube