పల్లెల్లోకి వెళ్లండి.. ప్రజలకు బిజెపిని మరింత చేరువ చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామీణ ప్రాంతాల్లో బిజెపిని మరింత బలోపేతం చేసి ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడానికి మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడానికి బిజెపి శ్రేణులు పల్లె పల్లెకు వెళ్లాలని గ్రామీణ ప్రాంత ప్రజలను చేరుకోవడమే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం గావ్ చలో అభియాన్ పేరిట కార్యక్రమం చేపట్టిందని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు.కొత్తపల్లి బిజెపి శాఖ ఆధ్వర్యంలో శనివారం గావ్ చలో అభియాన్ ప్రోగ్రాం సన్నాక సమావేశం జరిగింది.

 Bring Bjp Closer To People, Bjp, Rajanna Sircilla District, Boinpally Praveen Ra-TeluguStop.com

ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6 తేదీ సాయంత్రం నుండి జిల్లాలో ప్రారంభం కానున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బిజెపి శ్రేణులు అందరూ కృషి చేయాలన్నారు

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను ఓటర్లను చేరుకొని బిజెపి మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను హైలెట్ చేయడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు.ముఖ్యంగా ప్రోగ్రాం ఇన్చార్జులు గ్రామాలు అన్నీ పట్టణ బూత్ ల లో పర్యటించి గ్రామ ప్రజలతో ఓటర్లతో మమేకమై ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలను వివరించాలన్నారు.

అలాగే గ్రామీణ భారత అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని ప్రభుత్వ పనితీరును చాటిచెప్పే విధంగా ప్రచారం కొనసాగించాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతే చేయడమే లక్ష్యంగా బిజెపి శ్రేణులంతా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

పట్టణ అధ్యక్షులు కెంచ శేఖర్, మాజీ ఎంపీపీ,కౌన్సిలర్ వాసాల రమేష్, జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి ముత్తునూరి హరీష్, జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ఎర్రోళ్ల ప్రదీప్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు కొప్పుల హరి ప్రసాద్ ,చింతల శ్రీనివాస్ రెడ్డి,పట్టణ బీజేపీ నాయకులు వేముల చంద్ర శేఖర్, స్వర్గం నర్సయ్య,పట్టణ ఉపాధ్యక్షులు గోపు మునిందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు దూస సంతోష్, తొంటి వీరేశం, పేంటి రాజమౌళి, మ్యాకల పోచమల్లు,చిట్కూరి శ్రీనివాస్, మందల సేన రెడ్డి బూత్ అధ్యక్షులు బైరి శశిన్ ,ప్రవీణ్ పేంటి శ్రీకాంత్, ఎన్నం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube