పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో పోలీస్ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేపించుకున్న జిల్లా ఎస్పీ.
ఈ వైద్య శిబిరంలో అధికారులకు,సిబ్బందికి వారి కుటుంబ సబ్యులకు CBP,RBS,RFT,LFTLIPID PROFILE ,CUE ,BMI,ECG,2 డి కో ,కంటి పరీక్షలు నిపుణులైన Orthopedic,General physician, General surgery ,Ophthalmic,Gynicology Cardiology,న్యూరో వైద్య ,ఆప్తమలజీ నిపుణులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు, సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు.
పోలీస్ అదికారులు, సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని,సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు లు,యోగ, క్రీడల నిరహిస్తున్నామని అన్నారు.ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే గొప్ప సంపద అని,ప్రజలకు నిష్కళంకమైన సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు.
పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని.
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు.
పిలువగానే వచ్చి అధికారులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించిన LV ప్రసాద్, అశ్విని హాస్పిటల్, తారక రామ హాస్పిటల్, కృష్ణ న్యూరో హాస్పిటల్, కొనార్క్ హాస్పిటల్ వైద్యులకు, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు,సిబ్బంది ,కుటుంబ సభ్యులు,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు
.