గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మా స్వచ్ఛంద సంస్థ అనాధ ఆశ్రమంలో వృద్ధులకు మండల జడ్పిటిసి సభ్యురాలు కొమ్మిరిశెట్టి విజయ లక్ష్మణ్ దంపతుల 21వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మా స్వచ్ఛంద సంస్థ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
వారికి వృద్ధులు నిండు మనసుతో ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది.
వారు ఉన్నతమైన శిఖరాలలో అధిరోహించి ప్రజలకు సేవ చేసే గుణం కలిగిన పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో మా స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు మల్లు గారి నర్సాగౌడ్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పెద్దవేని వెంకట యాదవ్, కార్యదర్శి బరిగేల అభిలాష్, సతీశ్.వార్డ్ సభ్యులు రెడ్డి మల్ల రాజనర్సు, సీనియర్ నాయకులు ఎగదండి స్వామి, కల్వకుంట్ల బాలకృష్ణ రావు,మాణిక్యరావు, సిరపురo అంజయ్య, సురేందర్, గోరంటాల గ్రామ శాఖ మంత్రి సుధాకర్,చిట్టెంపల్లి రాజు, దోసల శంకర్,పల్లె శీను, ఎడబోయిన రత్నాకర్,యూత్ అధ్యక్షులు శ్రీశైలం, భాను, బాలకిషన్, సంతోష్ రెడ్డి, వికాస్,బాబు,శంకర్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది