మానవ జీవితంలో ఫోన్ ఒక భాగం అయిపోయింది.చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఫోన్ తోనే సమయాన్నిగడుపుతున్నారు.
ఇక సెలబ్రిటీలు రాజకీయ నాయకులయితే మొత్తం తతంగమంతా ఫోన్ ద్వారానే చేస్తూ ఉంటారు.చాలా విషయాలు ఫోన్ లోనే దాచుకునే పరిస్థితి.
ఈ క్రమంలో బీఆర్ఎస్ మంత్రి దయాకర్ రావు.ఇటీవల ఓ వేడుకకు వెళ్లి తన ఫోన్ పోగొట్టుకోవడం జరిగిందంట.
జనగామ జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మంత్రి దయాకర్ రావు.ఎమ్మెల్యే రాజయ్య పాల్గొనడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమం అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో దయాకర్ రావు ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది.ఫోన్ లో చాల ముఖ్యమైన సమాచారం.
కాంటాక్ట్ లు ఉండటంతో వెంటనే ఎమ్మెల్యే రాజయ్య అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసి… మంత్రి ఫోన్ కొద్దిసేపు వెతికించారు.అయినా ఎక్కడా కూడా దొరకకపోవడంతో… ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుకు ఇవ్వండి అని మైక్ లో ప్రకటన చేయించారు.
అయితే ఈలోపే ఫోన్ దొరకడంతో వెంటనే మంత్రి గారికి అందజేశారు.