1.జగన్ వల్ల తెలంగాణ లాభపడింది : నారాయణ
మోదీకి తెలంగాణకు జగన్ సహకరిస్తున్నారని మోడీకి జగన్ ముద్దుల కృష్ణుడు లాంటి వారని, ఆయన వల్ల తెలంగాణ లాభపడింది అని నారాయణ విమర్శించారు.
2 .ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్ టైం కోర్సులకు అడ్మిషన్
తిరుపతిలోని ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో ప్రవేశాలకు కోసం జూన్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు.
3.టిడిపి నాయకురాలు గౌతు శిరీష నోటీసులు
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో ఫేక్ పోస్ట్ లు పెట్టారనే ఆరోపణలపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
4.తప్పించుకున్న పులి
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం లో రెండు వారాలుగా పులి అటవీశాఖ అధికారులను పెడుతోంది.నిన్న రాత్రి పులి ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చినట్టే వచ్చి తప్పించుకుంది.
5.టి ఎస్ ఆర్ టి సి తిరుమల టికెట్ ఆఫర్
టి ఎస్ ఆర్ టి సి తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్ తోపాటు, తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు టికెట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
6.అది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : కేటీఆర్
తెలంగాణకు 2.50 లక్షల కోట్లు ఇచ్చాము అని కేంద్ర హోం మత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించడంపై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.అమితా చెప్పిన లెక్క తప్పు కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తప్పయితే అమిత్ షా తెలంగాణ గడ్డ పైన ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకోవాలి అని కేటీఆర్ సవాల్ చేశారు.
7.కొత్తపల్లి సుబ్బారాయుడు కలిసిన ముద్రగడ
నరసాపురంలో ఇటీవల వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ను కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు.ఇరువురి మధ్య సుమారు గంట పాటు చర్చలు జరిగాయి.
8.పొత్తులపై పురంధరేశ్వరి కామెంట్స్
పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్ అని ఆ పార్టీ నేత పురందరేశ్వరి వ్యాఖ్యానించారు.
9.చింతమనేనికి బెదిరింపు కాల్స్
టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.‘ నీ హత్యకు షూటర్ ని మా బాస్ నియమించాడు ‘ అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10.తిరుమలకు ఏపీ గవర్నర్ రాక
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల ఎనిమిదో తేదీన తిరుమల కు వెళ్లనున్నారు .
11.సీఐడీ అడిషనల్ డీజికి వరవరరావు లేఖ
Cid అడిషనల్ డీజీ కి టిడిపి నేత వర్ల రామయ్య లేఖ రాశారు.టిడిపి నేతలు సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
12.శ్రీశైలం జలాశయానికి వరద
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,233 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో నిల్ గా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా , ప్రస్తుతం 817 .20 అడుగులుగా కొనసాగుతోంది.
13.జూబ్లీహిల్స్ ఘటనపై తెలంగాణ గవర్నర్ ఆరా
జూబ్లీ హిల్స్ లో జరిగిన అత్యాచార ఘటన పై సమగ్ర నివేదిక అందించాలని అధికారులు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఆదేశించారు.
14.నేడు కేసీఆర్తో జార్ఖండ్ సీఎం భేటీ
నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో జార్ఖండ్ సీఎం సోరేన్ భేటీ కానున్నారు.
15.నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు
నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయి రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.పరీక్షకు మొత్తం 49,996 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
16.జంతర్ మంతర్ వద్ద ఆప్ ధర్నా
కాశ్మీర్ పండిట్ల హత్యపై ఆప్ ఆందోళన చేయనుంది నేడు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద కార్యక్రమం చేపట్టింది.
17.టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్స్
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అన్న అభియోగాలపై శ్రీకాకుళం జిల్లా టిడిపి నాయకులు గౌతు శిరీష సిఐడి పోలీసులు నోటీసు జారీ చేయడంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
18.ఏపీకి జాతీయ రహదారి మంజూరు
ఏపీ సీఎం జగన్ సూచన తో కేంద్ర ప్రభుత్వం తిరుపతి పీలేరు జాతీయ రహదారి నాలుగు లైన్ల రహదారి గా విస్తరించడానికి ఆమోదం తెలిపింది.
19.ఈటెల రాజేందర్ సవాల్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకుంటూ ఫలితం రాష్ట్ర ప్రభుత్వం పొందుతోందని కేంద్రం ఇచ్చే నిధులు సీఎం కేసీఆర్ తో కానీ, ఆర్థిక మంత్రి హరీష్ రావు తో అయిన తాను చర్చకు సిద్ధమని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,740
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,090
.