నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ఇవ్వాలి రైస్ మిల్లర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా :నిర్ణీత గడువులోగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.2023-24 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ ఈ నెల 30 వ తేదీలోగా అందజేయాలని సూచించారు.మళ్ళీ గడువు పొడగించమని స్పష్టం చేశారు.జిల్లా లోని 37 మంది రైస్ మిల్లర్లు పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు.గడువులోగా ఇవ్వని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

 Additional Collector Khimya Naik In A Meeting With Rice Millers To Give Cmr With-TeluguStop.com

ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube