ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడుతుంది - 9 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో 9 లక్షలు 25 వేల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను సోమవారం పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడడానికి పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు.

 Govt Protects Peoples Health Distribution Of 9 Lakh Cm Relief Fund Cheques, Govt-TeluguStop.com

ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభించడం జరిగిందన్నారు.

అలాగే ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చు పెట్టుకున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను అందించడం జరుగుతుందన్నారు.

పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం అత్యవసరంగా ఎల్ఓసి లను కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి, డైరెక్టర్లు గంట చిన్న లక్ష్మి,మిండేటి శ్రీనివాస్,నాయకులు చెన్నిబాబు,నంది కిషన్,గోపాల్, గుర్రం రాములు, శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube