జిల్లాలో ప్రమాదపు అంచున ఉపాధి హామీ పనులు

శనివారం బోయినీపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత మిడ్ మానేర్ డ్యాం కింద కొత్తగా తీసిన కాల్వ పక్కన ఉన్న భారీ ఎత్తున ఉన్న మొరం కుప్పలు ఉపాధి హామీ కూలీలచే ట్రాక్టర్ల ద్వారా మొరం నింపే పనులు నిర్వహిస్తున్నారు.మొరం కుప్పలు ఉపాధి హామీ కూలీల మీద పడి జరగరాని సంఘటన జరిగితే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సిపిఎం సిపిఎం పార్టీ నాయకులు గురజాల శ్రీధర్ ప్రశ్నించారు.

 Employment Guarantee Works In The District On The Brink Of Danger, Employment Gu-TeluguStop.com

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట ఏదైనా ప్రమాదం జరిగితే ఇప్పటివరకు కూడా ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలు లేదు

మరి మొన్నటికి మొన్న కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మట్టి పిల్లలు కూలి ఒక మహిళా చనిపోవడం జరిగిందని గుర్తు చేశారు.మరి రత్నంపేట గ్రామంలో ప్రమాదపు అంచున పని చేయించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటది కాబట్టి, తక్షణమే ఆ మొరం పనులు ప్రక్రియను నిలిపివేయాలని వారికి వేరే చోట ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.

అలాగే పని చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube