నేరాల నియంత్రణలో, ప్రజలకు మొదటగా అందుబాటులో ఉండే బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకం

నిర్ణిత సమయంలో డయల్-100 కాల్స్ కి త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరించాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డయల్ 100 కు కాల్ చేయగానే పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తారని ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలన్నారు.

 Blue Colts, Petrocar Personnel, Who Are The First Available To The Public, Play-TeluguStop.com

నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిపై నిఘా ఉంచాలన్నారు,సస్పెక్ట్, రౌడీ, కేడి, డిసిలను, విధిగా పాయింట్స్ బుక్స్ తరచుగా చెక్ చేయాలన్నారు.ప్రాపర్టీ సంబంధిత నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ అధికారుల పాత్ర కీలకం అని, డయల్ 100 కాల్ వచ్చినప్పుడు అత్యవసర సమయంలో బాదితులకి వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా సేవలు అందించాలని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.

విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా అత్యవర సేవలు అయిన రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పట్టణాల, గ్రామాలలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటికి సంబందించిన డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది లేదా పెట్రోల్ వెహికల్స్ సిబ్బంది తక్షణమే స్పందించి తగు చర్యలు అందించాలన్నారు.ప్రజలలో భద్రతభావం పెంపొందిస్తూ నేరస్థులకు నేరం చేస్తే పట్టుబడుతామనే భయం కల్గించే లక్ష్యంతో బ్లూ కోల్ట్స్ సిబ్బంది విభాగంలోని అధికారులు తమ ఏరియా పై సమగ్ర సమాచారం కలిగి ఉండి ఆప్రాంత ప్రజల రక్షణకు భరోసా కల్పించాలని అన్నారు.

గస్తీ తిరుగుతున్న ఏరియా నుండి రిపోర్ట్ చేయబడిన అన్ని డయల్100 ఫిర్యాదులను నిర్ణిత సమయంలో అటెండ్ చేయడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,వర్టికల్ డిఎస్పీ రవీందర్, సి.ఐ కరుణాకర్ సిబ్బంది సి.ఐ వెంకటేష్, బ్లూ కోల్డ్ పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube