గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు( Guntur karam hanuman movie ) ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రాగా మహేష్ బాబుకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల గుంటూరు కారంకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుంటే చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ రెండు సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి.

గుంటూరు కారం 5 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 92.45 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును దాటే అవకాశం ఉంది.
నైజాంలో ఈ సినిమా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా సీడెడ్, ఉత్తరాంధ్ర ఏరియాలలో వేర్వేరుగా 8 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమాకు 11 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 12 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.నెల్లూరులో ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.కర్ణాటకలో ఈ సినిమాకు ఐదున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు 13.40 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.సెకండ్ వీక్ కలెక్షన్లతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాల్సి ఉంది.హనుమాన్ మూవీ ( Hanuman movie )5 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమాకు 61.47 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. హనుమాన్ మూవీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.







