పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజాసంఘ నాయకుల పై కేసులు ఎత్తివేయాలి..

ప్రజాసంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా :పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు కోర్టులో హాజరయ్యారు.అనంతరం నాయకులపై పెట్టినా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక బి వై నగర్ లో సిఐటియూ కార్యాలయంలో ప్రజాసంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

 The Cases Against The Community Leaders Involved In The Struggle For Waste Lands-TeluguStop.com

ఈ సందర్బంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ తో పోరాడిన ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు, వెంటనే ప్రభుత్వం పోడు రైతుల పైన పెట్టిన అక్రమ కేసులు బెషరత్తుగా తొలగించాలని డిమాండ్ చేశారు.పోడు రైతుల పక్షాన నిలబడిన ప్రజా సంఘాల నాయకులపై కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 50 సంవత్సరాలనుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ భూమిలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ వెంటనే హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈసంపల్లి కొమురయ్య, జింక పోచయ్య, జాలపల్లి మనోజ్ గజ్జల ప్రశాంత్ గుర్రపు నరేష్ రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube