రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ జరిగింది.ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మించిన సంఘటన చోటు చేసుకుంది.
స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ చింతోజు శంకర్ కూతురు డాక్టర్ సిహెచ్ అఖిల ఈ సందర్భంగా మాట్లాడుతూ గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిందని గర్భం దాల్చినప్పుడే స్కానింగ్ లో నలుగురు పిల్లలు ఉన్నారని తెలియజేశారు.
మంగళవారం ఉదయం లావణ్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చిందని వారిలో ముగ్గురు కుమారులు,ఒక కూతురు ఉన్నారని తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు అఖిల తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ చింతోజు శంకర్ మాట్లాడుతూ ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారని వారంతా క్షేమంగా ఉన్నారని ఇది అరుదైన కేసుగా పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు.ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్న డాక్టర్ల బృందం,డాక్టర్ కేబీ తేజస్వి,డాక్టర్ ప్రతాప్, థియేటర్ సహాయక వైద్య బృందం లింగం,రాజు,సిబ్బంది విజయ్, అజయ్ పరశురాములు,వెంకటి,పద్మ తదితరులు పాల్గొన్నారు.