ఇటీవల మహిళల్లో అండాశయ క్యాన్సర్( Ovarian cancer) బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.స్త్రీ పునరుత్పత్తి అవయవాలలో ప్రారంభమయ్యే క్యాన్సర్‌నే అండాశయ క్యాన్సర్ అని అంటారు.
అండాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కనిపించవు.అస్పష్టమైన లక్షణాలు కనిపించినా కూడా చాలా మంది మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు.
చివరి దశలో క్యాన్సర్ ను గుర్తించినప్పుడు.దాని చికిత్స కష్టం అవుతుంది.
అందుకే ఈ సైలెంట్ కిల్లర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ నేపథ్యంలోనే అండాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది.? దీని లక్షణాలు ఎలా ఉంటాయి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.అండాశయ క్యాన్సర్ కు ఖచ్చితమైన కారణమేంటి అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు.అయితే అండాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్‌ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి.50 ఏళ్లు దాటిన మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఎండోమెట్రియోసిస్ వంటి వైద్య పరిస్థితులు, ధూమపానం, స్త్రీ తన జీవిత కాలంలో ఎక్కువ సార్లు అండాలను విడుదల చేయడం, అధిక బరువు లేదా ఊబకాయం, టాల్కమ్ పౌడర్ వాడటం, గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం, కుటుంబ చరిత్ర తదితర అంశాలు అండాశయ క్యాన్సర్ కు కారణం అవుతాయి.

ఇక ఇప్పుడు అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం.అండాశయపు క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు నిర్దిష్టమైన లక్షణాలుండవు.కానీ చాలా తరచుగా గుర్తించబడిన అండాశయ క్యాన్సర్ లక్షణాల్లో పొత్తికడుపు నొప్పి ఒకటి.నిరంతరంగా పొత్తికడుపు నొప్పి వస్తుంది.అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎంతో మంది మహిళలు తాము అనుభవించిన మొదటి లక్షణాల్లో పొత్తికడుపు నొప్పి ఒకటని చెప్పారు.అలాగే వెన్ను నొప్పి, తరచుగా లేదా అత్యవసర మూత్రవిసర్జన, ఆకలి లేకపోవడం, అజీర్ణం, ఉబ్బరం, అలసట, ఋతు చక్రంలో మార్పులు, జీర్ణక్రియ( Digestion )లో మార్పులు, బరువు తగ్గడం, అసాధారణ రక్తస్రావం వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాలుగా కనిపిస్తాయి.
మీకు ఈ లక్షణాలు ఉన్నాయని భావిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.సంబంధిత పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ ఉందో.
లేదో.నిర్ధారించుకోండి.