కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి రైతులు ఎదుగుతుంటే ఓర్వలేని రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే సుంకెరవిశంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినిపల్లి మండల కేంద్రంలో రైతువేదికలో నిర్వహించిన రైతుసమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

 Mla Ravi Shankar Sunke Comments On Revanth Reddy , Rajanna Sirisilla , Mla Rav-TeluguStop.com

రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ మరోసారి బయటపెట్టిందని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్‌ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని దుయ్యబట్టారు.

గతంలోనూ రైతులకు విద్యుత్‌ ఇవ్వకుండా గోస పెట్టారని విమర్శించారు.కాంగ్రెస్‌ ఆలోచనల్ని తెలంగాణ రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.

హస్తం పార్టీ వ్యవసాయ, రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారని అన్నారు.రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ అని,దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది హస్తం పార్టీ అని మండిపడ్డారు.

గతంలో రైతుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ కక్షపూర్తిత పాలన చేసిందన్నారు.గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ హామీని ఆ పార్టీ విస్మరించిందని దుయ్యబట్టారు.వైఎస్‌ఆర్‌ హయాంలో 9 గంటల విద్యుత్‌ ఇవ్వట్లేదని రైతులు ధర్నాలు చేశారని అన్నారు.’రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్ కు ఎందుకు ఏడుపు అని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదు.కాంగ్రెస్‌ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.సాగుకు 3 గంటల ఉచిత విద్యుత్‌ చాలని మాట్లాడుతున్నారు.కాంగ్రెస్‌ నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్‌ ఉండాలి.రైతులకు మాత్రం 24 గంటల విద్యుత్‌ ఉండవద్దా? కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తోంది.తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి.కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రైతులతో కలిసి తీర్మానాలు చేశామన్నారు .

కాంగ్రెస్‌ రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టూ వద్దంటుంది.రైతులకు ఉచిత విద్యుత్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy )… రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు సైతం వద్దంటారని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికే ధరణి ఎత్తివేస్తామన్న రేవంత్.ప్రకటనతో రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.అజ్ఞానంతో రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నారని ఆక్షేపించిన రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్​తో దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదిగారని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ , జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు లచ్చిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొండయ్య, నాయకులు, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్ ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube