రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసుపత్రుల సమన్వయ అధికారిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పంతగాని పెంచలయ్య జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించారు.పెంచలయ్య సర్జన్ గా మంచి గుర్తింపు పొంది, రికార్డు స్థాయిలో ఆపరేషన్లు చేసిన అనుభవం కలిగిన డాక్టర్ గా ప్రజల్లో ఆదరణ పొందారు.
ఈ సందర్భంగా డాక్టర్ పంతగాని పెంచలయ్య మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను పెంచలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.