రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామరావు పల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.చిన్నారుల ఆటపాటలు, వేష ధారణలు విశేషముగా అలరించాయి.
ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు మమత, విద్యా వాలంటీర్లు లాస్య, పద్మ, రజిత మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సమాఖ్య వివొ రాజమణి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ నవ్య, నాగేశం, చల్ల శ్రీనివాస్, 6 వ వార్డు సభ్యులు గంగ స్వామి గ్రామ కార్యదర్శి అను దీప్తి మరియు విద్యార్థుల తల్లి దండ్రులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వార్డు సభ్యుడు గంగ స్వామి పిల్లలకు స్వచ్ఛమైన త్రాగు నీటి కొరకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేస్తామని ముందుకు వచ్చారు.