రాజన్న సిరిసిల్ల జిల్లా-మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసిన వ్యక్తిపై కేసు,రిమాండ్ కి తరలింపు.సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్నా షామీర్ పెట్ ,మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్, s/o అంజనేయులు,age 43y అనే వ్యక్తి పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని,జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాలు అయిన ఫెస్ బుక్ , ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూప్స్ etc.లలో ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, విద్వేషాన్ని దుష్ప్రచారం చేయడం ,ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టిన, వ్యాప్తి చేసిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.