రాజన్న సిరిసిల్ల జిల్లా: సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు.కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తాజా మాజీ సర్పంచ్ లు మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న, సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిన నేటికి సర్పంచ్ లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు.
శాంతియుతంగా చేస్తున్నటువంటి సర్పంచుల ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తూ, సర్పంచులపై కక్ష్య సాధింపు చేస్తుందని ఉమ్మడి కరీంనగర్ సర్పంచులు అందరం భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈనెల 25వ తారీకు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యటించాలని, లేనిపక్షంలో 20వ తారీకు సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాజా మాజీ జేఏసీ సర్పంచులు అక్కెనపెల్లి కరుణాకర్, దుమ్మ అంజయ్య, పంజాల జగన్మోహన్ గౌడ్, మల్ల మేఘరాజ్, జోగు సాగర్, శ్రీనివాస్, గంప వెంకన్న, కే దామోదర్ రెడ్డి, గుంటుకు లచ్చన్న, లింగంపల్లి కరుణాకర్, మొగిలి సమ్మయ్య, లేచినేని నవీన్ రావు, రెడ్ల శ్రీనివాస్, వేముల దామోదర్, శ్రీనివాస్, గౌతం, ధర్మ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తదితర సర్పంచులు పాల్గొన్నారు.