అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా.

సుమారుగా 80,00,000/-రూపాయల విలువ గల 216 డాక్యుమెంట్లు స్వాధీనం.సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.

 Police Crackdown On Illegal Interest And Finance Traders , Sp Akhil Mahajan, Fin-TeluguStop.com

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అరుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద సుమారుగా 80,00,000/-రూపాయల విలువ గల 216 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి,తాత్కాలిక అవసరాల కోసం అధిక మొతంలో అవసరంకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు ,అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకుపాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దు అని ఎస్పీ కోరారు.ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని, అలాగే స్థానిక పోలీసు వారికి ,డయల్100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ గారు కోరినారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube