బిఆర్ఎస్ లో అవమానాలు తప్ప ఆదరణ ఏమి మిగలలేదు - కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : కేటీఆర్ ను సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు మిగిలాయే తప్ప సెల్ఫీలు దిగి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం మిగిలాయని ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు నేవూరి వెంకట్ రెడ్డి అన్నారు.సిరిసిల్లలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో పార్టీకి కేటీఆర్ కు పనిచేసినందుకు అనేక మందిని బిచ్చం బతుకు చేశాడని, నాయకులు కార్యకర్తల కళకళ తగిలి టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు.

 Nothing Left But Insults In Brs Ex-sarpanch Nevuri Venkat Reddy,  Insults In Brs-TeluguStop.com

పదేళ్లు నేను నా భార్య ఎల్లారెడ్డిపేట సర్పంచిగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి చాలా నష్టపోయామని అనేక అవమానాలకు గురయ్యామని,సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామాభివృద్ధి చేశానని ఆయన అన్నారు.ప్రజల మనసు దోచుకోవడానికి సొంత డబ్బులు ఖర్చు చేశానని నా గ్రామ అభివృద్ధికి జిల్లాలోనే అత్యధిక నిధులు నేను ఖర్చు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నా సొంత స్థలం ఎకరం ఇవ్వడం జరిగిందని నాకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.కేటీఆర్ కు నేను దగ్గర అయినప్పటికీ ఆయన నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని పార్టీలో కార్యకర్తలు,నాయకులు ఎవరు కూడా సంతోషంగా లేరని అన్నారు.

ఎల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా డబ్బులు ఖర్చు చేశానని నాకు 60 నుంచి 70 లక్షల డబ్బు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఆయన అన్నారు.గత ప్రభుత్వం సర్పంచులకు తీవ్ర అన్యాయం చేసిందని సర్పంచులు అప్పుల పాలయ్యారని, అలాగే సిరిసిల్ల నేత కార్మికులకు 260 కోట్లు బతుకమ్మ చీరలకు సంబంధించిన డబ్బులు గత ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఈ పాపం కేసిఆర్ కేటీఆర్ లకే తగులుతుందని ఆయన అన్నారు.

గత ప్రభుత్వంలో కేటీఆర్ బంధువులతో పాటు నియోజకవర్గంలో ఓ పదిమంది నాయకులు మాత్రం బాగుపడ్డారని మేము నాయకులమే అయినప్పటికీ మమ్మల్ని గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో ప్రగతిభవన్లోకి వెళ్లడానికి అనుమతి కోసం నాకు ఐదేళ్లు పట్టిందని సిరిసిల్ల నియోజకవర్గం లోని అనేకమంది నాయకులు నాలాగే ఎంతో అవమానపడ్డారని ఆయన అన్నారు.

కేటీఆర్ గచ్చిబౌలిలో నీకు ఉన్న 50 ఎకరాల భూమిలో నుంచి ఒక ఎకరం భూమి అమ్మితే 50 కోట్లు వస్తాయని ఎకరం భూమి అమ్మి వచ్చిన డబ్బులు కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి వారిని కాపాడాలని ఆయన పేర్కొన్నారు.గత ఎన్నికల్లో జడ్పిటిసి గా పోటీ చేసే అవకాశం వచ్చిన కేటీఆర్ వద్దని మంచి స్థానం కల్పిస్తానని నాకు మాయమాటలు చెప్పి నన్ను జెడ్పిటిసి గా కాకుండా చేశాడని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఎంతో గౌరవం ఉందని బి ఆర్ ఎస్ నాయకులు ఆలోచించాలని పేదల పార్టీ కాంగ్రెస్లోకి రావాలని ఆయన కోరారు.నా కుటుంబం అనేక బాధల్లో ఉన్న ఏరకంగా కూడా కేటీఆర్ నాకు సహాయం చేయలేదని విసిగి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని, అనేకమంది టిఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పుల పాలై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మిరిశెట్టి తిరుపతి,కౌన్సిలర్లు రెడ్డి నాయక్, కుడిక్యాల రవికుమార్, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube