ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మున్నూరు కాపు సంఘం

రాజన్న సిరిసిల్ల జిల్లా : మున్నూరు కాపు కులానికి చెందిన బాల బాలికలకు 33 జిల్లాల్లో వసతి గృహాల నిర్మాణానికి స్థలం కేటాయింపు చేయుటకు నివేదిక కోరుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రములోని 33 జిల్లాలో మున్నూరుకాపు సామాజిక వర్గమునకు చెందిన బాలబాలికల విద్యార్థులకు వసతికై హాస్టల్స్ నిర్మాణము చేయుటకు,తద్వారా మున్నూరు కాపు సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు పై చదువుల నిమిత్తం ఎంతో ఉపయోగపడేలా ప్రతి జిల్లా నందు 2 ఎకరాల స్థలము కేటాయింపు చేయుటకు

 Munnoor Kapu Sangam Thanked Chief Minister Revanth Reddy, Munnoor Kapu Sangam ,c-TeluguStop.com

బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా,దానికి సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రభుత్వం చిప్ కమిషనర్ ల్యాండ్ ఆడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారిని స్థల కేటాయింపు పరిశీలించి రిపోర్టు అందజేయాలని ఉత్తర్వులను జారీ చేసినందుకు ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ , ప్రతినిధులు బండారి బాల్ రెడ్డి, సిరిపురం మహేందర్, జవ్వాజీ లింగం, వివిధ గ్రామశాఖల అద్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube