రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారితో కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కలుపుకొని పనిచేయాలని అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి వస్తున్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు
బి ఎస్ పి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎడ్ల రాజకుమార్ ఎల్లారెడ్డిపేట మాజీ ఉపసర్పంచ్, నారాయణ లకు పార్టీ కార్యాలయంలో స్వాగతం పలికారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు నాయకులు మరొక్కసారి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికే సాగునీరు తాగునీరు విద్యుత్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు దగ్గరుండి సమస్యలు పరిష్కరించాలని అన్నారు
రైస్ మిల్లర్లతో కానీ అధికారులతో కానీ ఇబ్బంది ఏర్పడితే మమ్మల్ని సంప్రదిస్తే వెంటనే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు కొత్తపల్లి దేవయ్య, గంట బుచ్చగౌడ్,చెన్ని బాబు, బిపేట రాజు, గొల్లపల్లి మల్లేశం, దండు శ్రీనివాస్, సూడిద రాజేందర్, రాజు నాయక్, మల్లారెడ్డి, వడ్నాల దేవయ్య, అనవేని రవి, గణపతి, భూమిరెడ్డి పాల్గొన్నారు.







