రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో క్రీడాకారులకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు గురువారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత, క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పై దృష్టి సారించాలన్నారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.