ఈ మధ్యకాలంలో భారతదేశంలో చాలా చోట్ల మత్తు పదార్థాలకు( intoxicants ) సంబంధించిన అనేక కేసులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే.మత్తు పదార్థాలను వేరే దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకొని కొందరు వాటిని విక్రయిస్తూ ప్రజలను మత్తులో ముంచేస్తున్నారు.
ఇకపోతే మత్తు పదార్థలలో ఎక్కువగా లభించే వాటీలో ఒకటైన గంజాయి ( Marijuana ) రోజురోజుకి మన తెలుగు రాష్ట్రాల్లో మరింతగా విస్తరిస్తోంది.ఇందులో భాగంగానే పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అప్పుడప్పుడు గంజాయికి సంబంధించిన అనేక రైడింగ్ లు జరుగుతూనే ఉన్నాయి.

ఇకపోతే గంజాయిని స్మగ్గింగ్ చేసేటప్పుడు కొత్త పద్ధతులను కనుక్కుంటూనే ఉన్నారు స్మగ్లర్లు.ఇప్పటివరకు వీటిని కేవలం ఆకుల రూపంలో వాటిని ఎలాగో లాగా దాచి విక్రయించేవారు.తాజాగా వీటి రూపాన్ని మార్చేశారు స్మగ్లర్లు.ఈ గంజాయిని చాక్లెట్స్ రూపంలో, అలాగే పౌడర్ రూపంలో కస్టమర్స్ కు అందిస్తున్నారు.ఇకపోతే తాజాగా హైదరాబాద్ మహానగరంలోని ఓ కిరాణా షాపులో గంజాయికు సంబంధించి మిల్క్ షేక్ పౌడర్ అంటూ అమ్ముతున్న వైనం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం( Cyberabad Special Operation Team ) హైదరాబాద్ మహానగరంలోని ఓ కిరాణా షాపులో రైడ్స్ చేయగా షాప్ యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.ఇకపోతే ఈ కిరాణా షాప్ లో కొన్న పౌడర్ ను మిల్క్ షేక్ అని చెప్పి పిల్లలకు, పెద్దలకు ఇది పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి అమ్మడం మొదలు పెట్టాడు సదరు కిరాణా షాప్ యజమాని.ఇక ఈ మిల్క్ షేక్ పౌడర్ ను తాగిన వారు దాదాపు 7 గంటల పాటు మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దుకాణం పై దాడి చేసిన సమయంలో నాలుగు కేజీల గంజాయి పౌడర్, అలాగే 160 ప్యాకెట్లు గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.







