గ్రామాల్లో ,పట్టణాల్లో విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా( Rajanna Sirisilla District Distt ) పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ).ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

 Visible Policing Should Be Given High Priority In Villages And Towns.-TeluguStop.com

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో ఉన్న పెండింగ్ మిస్సింగ్ కేసులను పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్షించి,పెండింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి చేధించేలా కృషి చేయలని అధికారులను ఆదేశించారు.

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , ప్రజలకు భద్రతభావం కలిగిలే విజిబుల్ పోలీసింగ్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపట్టాలని, అధికారులు, సిబ్బంది గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలు,మహిళ చట్టలు,గంజాయి వలన కలుగు అనర్ధాలపై పలు ఆవాగహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు చేరువకావాలన్నారు.

జిల్లాలో వివిధ సమస్యల్లో తలదూర్చి ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ అట్టి సమస్యలు పరిష్కరిస్తాం అంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని అలాంటి వ్వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులని ఆదేశించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం అని , నిబంధనలకి విరుద్ధంగా జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటుగా ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ( drunk and drive )తనిఖీలు నిర్వహించాలన్నారు.

జిల్లాలో పిడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా పోలీస్ అధికారులు, టాస్క్ఫోర్స్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణా కు మూల కారుకులను గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, జిల్లాలో గంజాయ ఇతర మతుపదార్థాలపై పటిష్టమైన నిఘా ఉంచి సమూలంగా నిర్ములించాలని అన్నారు.పటిష్ట మైన ప్రణాళికతో లోక్ సభ ఎన్నికల నిర్వహణ.

జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరిగేలా ప్రతీ ఒక్క అధికారి కలిసి పని చేయాలనీ సూచించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతల కి విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచి సబంధిత అధికారుల ముందు బైండోవర్ చేయాలని, ఎన్నికల సమయంలో ఓటర్లని ప్రభావితం చేసే అంశాలపై నిఘా ఉంచి పకడ్బందీగా వ్యవహరించాలన్నారు.

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు.ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి,నాగేంద్రాచారి, మురళి కృష్ణ, సర్వర్, సి.ఐ లు,ఎస్.ఐ లు,ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube