ఎక్సైజ్‌ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి సారించండి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్‌ డివిజన్‌ ఎక్సైజ్‌ అధికారులతో ఎన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి సమీక్షా ఎక్సైజ్‌, ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఎక్సైజ్‌ యంత్రాంగం ప్రత్యేకంగా ఎక్సైజ్‌ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి అదేశించారు.

 Special Focus On Excise Crime, Excise Crime, Rajanna Sircilla District, Enforce-TeluguStop.com

గురువారం కరీంనగర్‌ ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఎక్సైజ్‌ సూపరిండెట్ల పరిధిలో జరుగుతున్న పని తీరుపై సమీక్షించారు.ఎక్సైజ్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఎక్సైజ్‌ అధికారులు డ్రగ్స్‌, గంజాయి, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ తోపాటు నాటుసారా తయారీ, రవాణ, అమ్మకాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు.

వీటితోపాటు పోలీస్‌ స్టేషన్లలో వివిధ కేసుల్లో పట్టుబ డిన గంజాయి, డ్రగ్స్‌ను డిస్పోజల్‌ అధికారి అనుమతితో కాల్చివేయాలని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండ చర్యలు పేట్టాలన్నారు.

స్టేషన్లలో చార్జీషీట్‌ వేయని కేసుల్లో వెంటనే చార్జీషీట్స్‌ వేయాలని కేసుల్లో శిక్షలు పడేవిధాంగా చర్యలు చేపడితే ఎక్సైజ్‌ క్రైమ్‌ చేయాలంటే నేరస్థులు భయపడుతారని అన్నారు.

మద్యం ఎంఆర్‌పీ ధరలు కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపే విషయంపై కూడ చర్యలు చేపట్టాలన్నారు.

ఎక్సైజ్‌ సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ మంచి ఫలితాలను రాబాట్టాలన్నారు.

ఈ ఎక్సైజ్‌ సమీక్షా సమావేశంలో కరీంనగర్‌ డిప్యూటి కమిషనర్‌ టి.డెవిడ్‌ రవికాంత్‌, అసిస్టేంట్‌ కమిషనర్‌ కె.వరప్రసాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఎక్సైజ్‌ సూపరిండెంట్లు పి.శ్రీనివాసరావు, ఏ.సత్యనారాయణ, ఎస్‌.పంచాక్షరీ, ఆర్‌.మల్లారెడ్డిలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube