రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో టీబి చాంపియన్స్ కి శిక్షణ ఇవ్వడం జరిగింది .ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా వైద్య అధికారి డాక్టర్ వసంతరావు ముఖ్యఅతిథిగా పాల్గొని సిరిసిల్ల జిల్లాలో క్షయ వ్యాధి కేసులు తగ్గించడం పట్టడం కోసం తీసుకోవాల్సిన చర్యలు దానికిగాను ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు వివరించడం జరిగింది.
టిబి ఛాంపియన్స్ అనగా క్రితం టీబి వ్యాధికి గురై మందులు వాడి వ్యాధి నుండి కోలుకొని నయమైన వారిని టీబి చాంపియన్స్ గా పిలవబడతారు.ఈ టీబి చాంపియన్స్ కి నేడు టీబీ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధి వ్యాధి నిర్ధారణకు తీసుకోవాల్సిన పరీక్షలు, ట్రీట్మెంట్ గురించి వివరంగా వివరించి చెప్పడం జరిగింది.
ఈ శిక్షణ అనంతరం వారి వారి సబ్ సెంటర్ పరిధిలో జరిగేటటువంటి గ్రామసభలు, మహిళా సంఘాల మీటింగ్లు ,స్కూల్స్లలో, వారి వారి గ్రామాలలో జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రజలు ఎక్కడైతే ఎక్కువమంది
జమవుతారో ఆ ప్రదేశాలలో వారు టిబి వ్యాధి పట్ల అక్కడ ప్రజలకు వివరించి చెప్పడంతో పాటు వారి సొంత అనుభవం కూడా ప్రజలకు వివరించి ప్రజలలో టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించి టిబి ఇన్ఫెక్షనలు తగ్గించడం కోసం టీబి వల్ల మరణాలను తగ్గించడం కోసం వారి వంతు సహకారం అందించడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ఇల్లంతకుంట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరణ్య, డీపీపీఎం కోఆర్డినేటర్ బిగిందర్,ఆరోగ్య విస్తరణాధికారి రమణ, ఎస్ టి ఎస్ జైత్యా, సూపర్వైజర్ జవహర్ పాల్గొనడం జరిగింది.