ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకొండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత మెరుగైన విద్య అందిస్తున్నామని , ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలనీ, ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరారు.తేదీ 24న కోరుట్లపేట, బొప్పాపూర్,రాగట్లపల్లి, పదిర గ్రామాల్లో అధ్యాపకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

 Take Advantage Of Free Government Education, Free Government Education, Yellare-TeluguStop.com

ఉచిత పుస్తకాలు అందించబడుతాయనీ, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన , విశాలమైన గదుల సౌకర్యం, ఇంగ్లీష్ , తెలుగు మీడియం బోధన సౌకర్యం,

స్కాలర్షిప్ సౌకర్యం కలదనీ, తెలిపారు.సాంస్కృతిక, క్రీడల్లో ప్రోత్సాహం , ఎన్.ఎస్.ఎస్ ద్వారా సామాజిక సేవకులను తయారు చేయడం, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు , ప్రతిభా పురస్కారాలు,వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు,బుట్ట కవిత ,కొడిముంజ సాగర్, చిలుక ప్రవళిక తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube