ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకొండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత మెరుగైన విద్య అందిస్తున్నామని , ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలనీ, ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరారు.

తేదీ 24న కోరుట్లపేట, బొప్పాపూర్,రాగట్లపల్లి, పదిర గ్రామాల్లో అధ్యాపకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఉచిత పుస్తకాలు అందించబడుతాయనీ, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన , విశాలమైన గదుల సౌకర్యం, ఇంగ్లీష్ , తెలుగు మీడియం బోధన సౌకర్యం, స్కాలర్షిప్ సౌకర్యం కలదనీ, తెలిపారు.

సాంస్కృతిక, క్రీడల్లో ప్రోత్సాహం , ఎన్.ఎస్.

ఎస్ ద్వారా సామాజిక సేవకులను తయారు చేయడం, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు , ప్రతిభా పురస్కారాలు,వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు,బుట్ట కవిత ,కొడిముంజ సాగర్, చిలుక ప్రవళిక తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

నయనతారతో గొడవలు నిజమే.. విభేదాలపై ఓపెన్ అయిన త్రిష!