ప్రజావాణి ఫిర్యాదుకు స్పందించిన అధికారులు.

తిమ్మాసి కుంటను పరిశీలించిన జిల్లా, మండల అధికారుల బృందం.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్నటువంటి తిమ్మాసికుంట గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కుంట కట్ట తెగి పోవడంతో కుంట దిగువ భాగంలో ఉన్నటువంటి వరి పంట పొలాలు కొట్టుకుపోవడం జరిగిందని, ఆ దారి గుండా రోడ్డు కూడా కొట్టుకపోవడం జరిగిందని కుంటకు మరమ్మతులు చేయాలని, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించగా ఈరోజు పంచాయతీరాజ్ డి ఈ సత్యనారాయణ వచ్చి పరిశీలించడం జరిగింది.

 Officials Who Responded To Prajavani's Complaint, Prajavani , Complaint , Oggu-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాసికుంట కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని, దిగువన ఉన్న వరి పంట పొలాలను పరిశీలించి ప్రకృతి వైపరీత్యాల నిధులనుండి కల్వర్టును ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు చేసి కలెక్టర్ కు నివేదిక అందిస్తామని తెలిపారు.ఆయన వెంట ఇరిగేషన్ డి ఈ సత్యనారాయణ,తహసిల్దార్ జయంత్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, రైతులుఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube