రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ రెడ్డి సంక్షేమ సంఘం అన్ని మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, సభ్యులు నేడు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం శాలువాతో సత్కరించారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించాలని శాసనసభ్యులు రమేష్ ని కోరారు.
దీనికి ఎం.
ఎల్.ఏ.రమేష్ గారు స్పందిస్తూ సంఘ అభివృద్ధికి నా వంతు కృషి తప్పక వుంటుందని, భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపుకు సంపూర్ణంగా సహకరిస్తానని సంఘ సభ్యులకు తెలియచేశారు.