హెయిర్ ఫాల్.స్త్రీలనే కాదు పురుషులనూ తీవ్రంగా మదన పెట్టే సమస్య ఇది.పెళ్లి అయిపోయాక జుట్టు ఊడినా.పురుషులు పెద్దగా పట్టించుకోరు.
కానీ, పెళ్లికి ముందే జుట్టు విపరీతంగా రాలుతుందంటే.ఇక వారి బాధ వర్ణణాతీతం.
ఎందుకంటే, ఈ రోజుల్లో జాబ్ లేని అబ్బాయిలకు కూడా పెళ్లి అవుతుంది.కానీ, నెత్తిపై జుట్టు లేని అబ్బాయిలకు మాత్రం పిల్లను ఎవరూ ఇవ్వడం లేదు.
అందుకే పెళ్లి కాని పురుషులు హెయిర్ ఫాల్ అంటేనే తెగ హైరానా పడిపోతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సీరమ్‌ను వాడితే గనుక హెయిర్ ఫాల్ సమస్యకు దూరంగా ఉండొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుని ఒకసారి వాటర్‌తో వాష్ చేయాలి.
ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకుని.ఆపై వాటర్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మరో గిన్నెను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఇందులో బియ్యం-మెంతుల నీటిని ఆరేడు టేబుల్ స్పూన్ల వరకు వేసి మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటే సీరమ్ సిద్దమైనట్లే.ఈ సీరమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే రెండు వారాల పాటు వాడుకోవచ్చు.హెయిర్ రూట్స్‌కు ఈ సీరమ్‌ను అప్లై చేసి.కనీసం ఓ పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
పురుషులు ఇలా నాలుగు రోజులకు ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.







