రాజన్న సిరిసిల్ల జిల్లా :గత కొద్ది రోజుల క్రితం బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో బత్తిని లస్మయ్య అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కెక్రమంలో మోకుజారి కింద పడడం జరిగింది.వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్( Chidugu Govardhan Goud ) 5000 రూపాయలు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పులి లక్ష్మీపతి గౌడ్ 500 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
వాటిని బోయినిపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud ) బాధితునికి అందజేశారు.జిల్లా సహాయ కార్యదర్శి నాగుల సాంబయ్య గౌడ్.
మండల కోశాధికారి మెరుపుల గంగాధర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బండారి మహేందర్ గౌడ్, చింతల కోటి మహేష్ గౌడ్,బత్తిని తిరుపతిగౌడ్, మల్లయ్య గౌడ్, వంగ తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.