ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే, ఆది శ్రీనివాస్.కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ఘనస్వాగతం పలికిన సనుగుల గ్రామప్రజలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: మీ ఇంట్లో ఒకడిగా ఉంటా మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.చందుర్తి మండలం సనుగుల,దేవునితండా గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే గా ఎన్నికై మొదటిసారి సనుగుల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.ఇటీవల మరణించిన దేవుని తండా సర్పంచ్ భూక్య పంతులు నాయక్,గంగాధర రామస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన చందుర్తి మండలప్రజలతో పాటు,సనుగుల దేవుని తండా గ్రామాల ప్రజానీకానికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటాను అన్నారు.
మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ గా మరో మెట్టేక్కించారని అన్నారు.ఎన్నికల ప్రచార సమయంలో మీకు చెప్పినట్టుగానే మీ ఇంట్లో ఒకడిగా ఉంటానని మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం కింద 10 లక్షల వరకు అమలు చేశామన్నారు.
నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.