ప్రస్తుత చలికాలంలో సర్వసాధారణంగా సతమతం చేసే సమస్యల్లో దగ్గు ఒకటి.ఒక్కోసారి దగ్గు పట్టుకుందంటే అంత సులభంగా వదిలిపెట్టదు.
దగ్గు కారణంగా రాత్రుళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు.ఈ క్రమంలోనే దగ్గును వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో టానిక్స్ ను వాడుతుంటారు.
అయితే న్యాచురల్ గా కూడా దగ్గు ని తరిమికొట్టొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.
రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే దగ్గు దెబ్బకు తగ్గిపోతుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్క వచ్చేలా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్కల తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, మూడు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్‌ను కలిపితే మన డ్రింక్ సిద్దమవుతుంది.రోజులో ఏదో ఒక సమయంలో ఈ డ్రింక్ ను సేవించాలి.
రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే దగ్గు నుంచి త్వరగా మరియు వేగంగా బయటపడతారు. జలుబు, ఫ్లూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉన్న సరే ఉపశమనం లభిస్తుంది.
ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల క్యాలరీలు చాలా త్వరగా కరుగుతాయి.దీంతో వెయిట్ లాస్ అవుతారు.కాబట్టి తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.