సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కొన్ని దశాబ్దాల పాటు హీరోలుగా వాళ్ళ స్టార్ డమ్ నీ కంటిన్యూ చేస్తూ కొనసాగారు.అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోలు అందరూ వారి వారి సినిమాలతో దూసుకుపోతుంటే జగ్గయ్య కూడా చాలా సినిమాల్లో హీరోగా నటించాడు.
అయితే వాళ్ళ అంత గుర్తింపు రాకపోయిన జగ్గయ్య మంచి నటుడు అనే గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.మొదట్లో సినిమాలో హీరోగా నటించినప్పటికీ తనకి అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో విలన్ గా కూడా చేశాడు.
సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు జగ్గయ్య తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో తరిగిపోని చెరిగిపోని ముద్రని వేశాడు.ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఒక నటుడిగా తను ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు.
అయితే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వారసులు వచ్చారు అందులో బాలకృష్ణ ఒక్కడే అగ్రహీరోగా నిలబడ్డాడు ఆ తర్వాత జనరేషన్లో ఎన్టీఆర్ మనవళ్ళు చాలామంది వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అగ్ర హీరోగా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు అంతేకాకుండా తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు సాధించారు ఆయన చేసిన సింహాద్రి సినిమా అయితే ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది.అలాగే కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా మహేష్ బాబు హీరో గా వచ్చాడు మహేష్ బాబు కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది.
ప్రస్తుతం మహేష్ బాబు మాస్ హీరోగా కొనసాగుతున్నాడు అతని కెరీర్లో ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తండ్రి కృష్ణ కి ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు.నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి నాగార్జున వచ్చి తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు నాగార్జున తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు.
ఆ తరం అగ్ర హీరోలలో వాళ్ళ కొడుకులని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయనీ అగ్ర హీరో ఎవరు అంటే శోభన్ బాబు అని చెప్పాలి.
అయితే ఆ తరం సినిమాలలో హీరోల పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన జగ్గయ్య కి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉండేవారు కానీ ఎవరిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు జగ్గయ్య అన్న మనవడు అయిన సాత్వి కృష్ణ ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆయన కొన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ఆడకపోవడంతో అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.దాంతో అతను బుల్లితెరపై చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేస్తున్నాడు.
స్వాతిచినుకులు, అగ్నిసాక్షి లాంటి సీరియల్లో యాక్టింగ్ చేస్తూ తన నటనతో జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.అయితే ఇండస్ట్రీలో వారసత్వం అనేది సహజం అయిపోయింది. జగ్గయ్య తరం హీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి వారు ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేశారు అలాగే వాళ్ల బాటలోనే తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి కూడా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ అయిన త్రిబుల్ ఆర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు అయితే ఇండస్ట్రీలో వారసత్వం అనేది కంపల్సరీ అయిపోయింది.
కృష్ణంరాజు కూడా తనకి మగపిల్లలు లేకపోవడంతో తన తమ్ముడి కొడుకు అయిన ప్రభాస్ ని హీరోగా ఈశ్వర్ సినిమాతో అరంగేట్రం చేయించాడు.అనతికాలంలోనే ప్రభాస్ రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా చేసి వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం రాధేశ్యాం, సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.శోభన్ బాబు లాంటి అగ్ర హీరో ఒక్కడే ఆ తరంలో వారసులను పరిచయం చేయడానికి ఇష్టపడలేదు కానీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు తమ వారసులని హీరోగా పరిచయం చేయడానికె ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
.