దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటారు.అయితే ఈమె నటించిన తాజా చిత్రం కనెక్ట్.
ఈ సినిమా తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా యాంకర్ సుమతో కలిసి ఇంటర్వ్యూ నిర్వహించిన నయనతార సుమ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా సుమ నయనతార వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నలు వేశారు.
ఇక నయనతార విగ్నేష్ శివన్ తొమ్మిది సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న అనంతరం పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సందర్భంగా ఈమె ప్రశ్నలు అడుగుతూ మీరిద్దరూ గొడవపడితే ముందుగా ఎవరు సైలెంట్ అవుతారని ప్రశ్నించడంతో నయనతార సమాధానం చెబుతూ ఇద్దరి మధ్య గొడవలు వస్తే నేనే ముందుగా సైలెంట్ అయ్యి తనకు గుడ్ నైట్ చెప్పి వెళ్లి పడుకుంటా అని సమాధానం చెప్పారు.ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత చాలామంది వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
మరి ఇలాంటి సమయంలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నయనతార సమాధానం చెబుతూ సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి.తన విషయాల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు.అయితే కొన్నిసార్లు అభిమానులు చూపే అత్యుత్సాహం తనని చాలా ఇబ్బందులకు గురి చేసిందని ఈమె తెలియజేశారు.
ఇక తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.అసలు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లకు నయనతార హాజరు కాకపోవడానికి గల కారణం కూడా తెలియజేశారు.
ఈ సినిమా విడుదల సమయంలో తాను ఇండియాలో లేనని ఈమె సమాధానం చెప్పుకొచ్చారు.మొత్తానికి నయనతార ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







