ఆమె వల్ల నా చదువు నాశనం అయ్యింది: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma About Jayamalini , Ram Gopal Varma, Jayamalini, Sridevi, Ashu Reddy, Actress Jaya Malini, Bhanupriya, Tollywood,

రాంగోపాల్ వర్మ….అందాల తార శ్రీదేవి కి ఫ్యాన్ అని ఆమె కోసమే సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, శ్రీదేవిని కేవలం అరదించలేదు అని ఆమెను ఎంతగానో ప్రేమించానని చెప్తూ వస్తున్నాడు.

 Ram Gopal Varma About Jayamalini , Ram Gopal Varma, Jayamalini, Sridevi, Ashu R-TeluguStop.com

ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని, ఆమె నాకు ఆరాధ్య దైవం అంటే ఎన్నో కబుర్లు చెప్తున్నాడు.ఈ విషయం మీడియా లో మాత్రమే కాదు శ్రీదేవితో కూడా ఎన్నోసార్లు చెప్పాడట.

కానీ ఆమె చాలా సున్నితంగా వాటిని తిరస్కరించేదట.ఇక బోనీ కపూర్ తో ప్రేమలో పడి శ్రీదేవి అతడిని పెళ్లి చేసుకున్న తర్వాత వర్మ పిచ్చోడైపోయాడట.

అసలు శ్రీదేవి నీ పెళ్లి చేసుకోవడానికి బోనీ పెట్టి పుట్టాడని ఆయనతోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అందరినీ షాక్ గురి చేసింది.అంతలా శ్రీదేవిని ఆరాధించే వర్మ ఇంకా ఆమెను కాకుండా చాలా మందితో ప్రేమలో పడుతూనే ఉన్నాడు.

ఇక ఈ మధ్యకాలంలో అషు రెడ్డి కాలు నోట్లో పెట్టుకుని కొరికేంతగా ఆయన అందానికి బానిస అయిపోయాడు అని మనం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఇలా అందాన్ని ఆరాధించడం వర్మకి నాటి శ్రీదేవి నుంచి మొదలై నేటి అషు రెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది.

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి జయ మాలిని తో ఫోన్ కాల్ లో మాట్లాడిన వర్మ నా చదువు సంక నాకి పోవడానికి కారణం మీరే అంటూ చెప్పడంతో ఆవిడ కూడా షాక్ గురయ్యారు.జయమాలిని డాన్స్ చేసిందంటే చాలు తనకు పిచ్చెక్కిపోయేదని ఆమె కోసం చదువు మానేసి మరి థియేటర్ కి వెళ్లి పోయే వాడిని అంటూ చెప్పుకోచ్చారు వర్మ.

Telugu Jayamalini, Ram Gopal Varma-Telugu Stop Exclusive Top Stories

ఆయన అభిమానానికి ముగ్దు రాలైన జయమాలిని సైతం వర్మ కళ్ళు ఎంతో బాగుంటాయంటే ప్రశంసల వర్షం కురిపించింది.భానుప్రియ తర్వాత అంత పెద్ద కళ్ళు ఉన్న వ్యక్తి మీరే అంటూ వర్మ కి కితాబు ఇవ్వడం విశేషం.మొత్తానికి తన జీవితంలో శ్రీదేవి మాత్రమే కాదు ఎంతో మందిని ఆరాధించేంత పెద్ద మనసుందని వర్మ నిరూపించుకున్నాడు.అతడు అందానికి నిజంగా చెప్పాలంటే బానిస అంటే ఒప్పుకుంటాడు కూడా.

ఇప్పటికీ కుదిరితే జయ మాలిని చేత తన సినిమాలో ఐటం నెంబర్ చేయించుతానంటూ వర్మ వ్యాఖ్యలు చేయడం కోసం కొస మెరుపు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube