సినిమా ప్రపంచంలో ఎన్నో వార్తలు వస్తుంటాయి.అందులో కొన్ని నిజం ఉంటాయి.
మరికొన్ని పుకార్లు ఉంటాయి.హీరో, హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే చాలు.
వారి మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు వండి వారుస్తాయి న్యూస్ చానెల్లు.అందులో చాలా వరకు అవస్తవాలు ఉంటాయి.
ఎక్కడో ఒకచోట నిజం ఉంటుంది.ఏది ఏమైనా పలానా హీరో.
పలానా హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని.పలనా హీరోయిన్.పలానా నటుడితో ప్రేమలో ఉందని.పలానా దర్శక నిర్మాతలు.ఆయా హీరోయిన్లతో దగ్గరి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని మనం నిత్యం వార్తలు వింటూనే ఉంటాం.తాజాగా అలాంటి వార్త గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి గురించి కూడా అప్పట్లో పలు వార్తలు వచ్చాయి.తనతో కలిసి పలు సినిమాలు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నాతో అతడికి అఫైర్ ఉందని మీడియా ఊదరగొట్టింది.
అన్న సూర్య సూచనలతో సినిమాల్లోకి వచ్చిన కార్తి.కొద్ది కాలంలోనే మంచి సినిమాలు చేసి టాప్ హీరోగా గుర్తింపు పొందాడు.
వరుస హిట్లు సాధించాడు.అన్న సూర్య కంటే తక్కువ సినిమాలే చేసినా.
తెలుగు జనాలకు కొద్ది రోజుల్లోనే కార్తి మరింత దగ్గరయ్యాడు.కార్తి నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.
తెలుగు జనాలు ఈ సినిమాలను బాగా ఆదరించారు కూడా.
కార్తి-తమన్నా కలిసి నటించిన ఆవారా సినిమా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా ఆడింది.ఈ సినిమాతో కార్తి తెలుగు జనాలకు చేరువయ్యాడు.ఇక ఖాకీ సినిమా తెలుగులో దుమ్మురేపింది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కార్తి, తమన్నా తెగ హడావిడి చేశారు.అప్పుడే వీరి మధ్య అఫైర్ ఉందనే ప్రచారం జరిగింది.
వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారే రూమర్స్ వచ్చాయి.
ఈ వార్తలపై చివరకు కార్తి వివరణ ఇచ్చాడు.తాను చిన్నప్పటి నుంచి బాయ్స్ కాలేజీలోనే చదివినట్లు చెప్పాడు.తమన్నాతో కలిసి ఒకటి రెండు సినిమాలు చేసినంత మాత్రాన తమ మధ్య ఏదో సంబంధం ఉందని ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.
అయితే ఈ వార్తలను తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు.