జీవితంలో ఏదన్నా సాధించాలంటే పట్టుదల అనేది చాలా ముఖ్యం.ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినాగాని అనుకున్న లక్ష్యం చేరడానికి ప్రయత్నించాలి.
అప్పుడే మనం అనుకున్న లక్ష్యం చేరతాము.ఇప్పుడు మనం సినీ ఇండస్ట్రీలో చూసే కొంతమంది నటి నటులు వారి జీవితంలో ఎన్నో బాధలు, కన్నీళ్లు అనుభవించి వచ్చినవారే.
వారి జీవితాల్లో కూడా కొంత చీకటి కోణం ఉంటుంది.ఎన్నో కన్నీటి గాధలుంటాయి.
వాళ్లు సినిమాల్లోకి రావడానికి ముందు అవకాశాల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.తినడానికి తిండి లేక, వేసుకోవడానికి బట్టలు లేక, కనీసం నడవడానికి చెప్పులు కూడా లేని పరిస్థితులను కొంతమంది ఎదురుకున్నారు.
అలాంటి ఓ స్టార్ నటుడి జీవితంలో జరిగిన విషాద సంఘటనలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.!! సముద్రఖని పేరు తెలియని దక్షిదాది ప్రేక్షకులు ఉండరు అంటే సందేహం లేదు.
ఎందుకంటే సముద్రఖని ఎన్నో తెలుగు,తమిళ చిత్రాల్లో నటించారు.అంతేకాదు ఆయన నటించిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ మధ్య తెలుగులో రిలీజ్ అయిన అల్లుఅర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో.’ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటించి అందరిని మెప్పించాడు.అంతేకాకుండా ఈ సంక్రాతికి రిలీజ్ అయిన రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కూడా సముద్రఖని విలన్ గా నటించాడు.
ఆయన విలనిజానికి ప్రేక్షకులు సైతం దాసోహం అయిపోయారు.
ఇప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సముద్రఖని సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఇబ్బందులతో పాటు ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారట.అయితే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అవకాశాల కోసం సముద్రఖని ఎన్నో ఇబ్బందులు పడ్డారట.సముద్రఖని మనకి విలన్ గా మాత్రమే తెలుసు కానీ నిజానికి సముద్రఖని ఒక దర్శకుడు, ఒక రచయితగా తమిళ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉండేవారు.
ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి కూడా.ఇప్పుడు తెలుగు నాట విలన్ గా ఒక మంచి గుర్తింపు తెచుకున్నారు.సముద్రఖని అనే పేరు విజయం వెనుక ఎంతో కష్టం ఉందని అయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.అందులో తాను తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించారు.
మొదటలో సినిమా అవకాశాలు కోసం చెన్నై వచ్చారట.ఆ సమయంలో సముద్రఖని, మరో ఇద్దరితో కలిసి ఒక రూమ్‌లో అద్దెకి ఉండేవారట.
ఆ సమయంలో ఆయనకు తినడానికి కూడా డబ్బులు లేవట.ప్రతి రోజూ సినిమాలో నటించే అవకాశం కోసం ఇండస్ట్రీ చుట్టూ తెగ తిరిగేవారట.
ఆ సమయంలో ఆ ఆయన పరిస్థితి మరి దారుణంగా ఉందట.ఎంత దారుణం అంటే ఆయన కాళ్లకు చెప్పులు కొనుక్కుని వేసుకునేందుకు కూడా డబ్బులు ఉండేవి కాదట.
ఒకరోజు ఆయన సినిమా అవకాశం కోసం బయటకి వెళ్ళాల్సి వచ్చిందట.
ఆ సమయంలో ఆయనకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవట.దీనితో ఆయన అతని రూమ్‌లో ఉన్న తన స్నేహితుడు బాత్రూంలో వాడుకునే చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించారట.కానీ ఆ చెప్పులు కూడా సముద్రఖని వేసుకుని వెళ్లటానికి అతడు ఒప్పుకోలేదట.
అంతేకాదు సముద్రఖని ని తీవ్రంగా అవమానించాడట దీంతో ఆయన చేసేదేంలేక బాధతో అలానేకాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్లారట.ఆ సమయంలో ఆయనకి జరిగిన అవమానానికి చచ్చిపోదామని నిర్ణయించుకున్నారట.
ఇక చచ్చిపోదామని డిసైడ్ అయ్యిరట.అయితే అప్పుడు దేవుడు పంపినట్లు ఒకతను రోడ్డు మీద బైక్‌పై వెళుతూ, సముద్రఖని కి చూసి లిఫ్ట్ ఇచ్చారట.
ఆ ప్రయాణములో ఆ బాటసారి సముద్రఖని కథ విని, ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారట.
చచ్చిపోదామనుకున్న ఆయన ఆలోచనల్ని సక్రమంగా మార్చారట.
ఇది జరిగిన మూడురోజులకు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే అవకాశం వచ్చిందట.అప్పుడు ఆయనకి తొలి పారితోషికంగా రూ.100 వచ్చాయట.ఆ 100 రూపాయలతో మొదటగా చెప్పుల షాప్ కి వెళ్లి మూడు జతల చెప్పులు కొనుకున్నారట.
అయితే ఇప్పటికీ సముద్రఖని గారు తనకి వచ్చే డబ్బులలో ఎక్కువ శాతం డబ్బులు చెప్పులు, షూల కోసం మాత్రమే ఖర్చు చేస్తు ఉంటానని సముద్రఖని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ తనకు బాధకలుగుతుందని, క్షణికావేశంలో నేను తీసుకున్న తప్పు నిర్ణయం వలన నా ప్రాణం పోయి ఉండేదని భాదపడుతూ ఉంటారట.
ఒక కష్టం వెనుక ఎంతో సుఖం దాగి ఉంది అనడానికి సముద్రఖని జీవితం ఒక ఉదాహరణ.కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగిపోతుంటే మనం కలలు కన్న జీవితం మన సొంతం అవుతుంది.
చనిపోవడం అనేది ప్రతి సమస్యకు పరిష్కారం కాదు.!!
.