ఏపీలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..!!

ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురవడం జరిగింది.దక్షిణాదిలో భారీ స్థాయిలో తుఫానులు రావడంతో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి.

 Rains In Next Three Days In Ap , Imd, Rains In Ap,rains In Next Three Days,storm-TeluguStop.com

ఫలితంగా ప్రజలు మరియు రైతుల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సంవత్సరం చివరాఖరిలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందట.

దీంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈ అల్పపీడన ప్రభావం ఏపీలో కూడా ఉంటుందని దీంతో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయుగుండంగా మారడం జరిగిందంట.ఈ వాయుగుండం శ్రీలంక మీదుగా పయనించే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం చేసింది.దీంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు పోరాటంతో పాటు ఏపీపై ద్రోణి ప్రభావం ఉండనుందని పేర్కొన్నారు.ఈ కారణంగా ఏపీలో చలి ప్రభావం పెరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలుముకునే అవకాశం ఉందని.

వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube