ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.36<
సూర్యాస్తమయం: సాయంత్రం 05.45
రాహుకాలం: మ.10.03 నుంచి 00.12 వరకు
అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.52 నుంచి 09.36 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.
దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారంలో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఈ రోజు స్నేహితులతో గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
కర్కాటకం:

కొత్త వ్యక్తులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.
సింహం:

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ అభివృద్ధి ఉంది.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
దూర ప్రాంతం నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి లేదా నష్టం జరుగుతుంది.
వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.
ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకున్నా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.దూరపు ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈ క్రమంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
మకరం:

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడే అవకాశాలున్నాయి.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఈరోజు సంతోషంగా గడిపుతారు.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి కలుగుతుంది.