సోమవారం( Monday ) ఆది దేవుడు పరమేశ్వరుడికి( Parameshwara ) అంకితం చేయబడిందని పండితులు చెబుతున్నారు.సోమవారం రోజు పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు.
భక్తులు పిలవగానే పలుకుతాడని వారి కోరికలను తీరుస్తాడని శివుడిని భోళా శంకరుడు అని పిలుస్తారు.అయితే శివుడి ఆరాధనలో వివిధ వస్తువులను ఉపయోగిస్తారు.
ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు.ఆయనకు అభిషేకం చేస్తే వెంటనే ప్రసన్నమవుతాడని ప్రజలు నమ్ముతారు.
పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.ఇక వేద మంత్రాల పఠనం( Mantras ) చాలా శక్తిమైనదిగా పరిగణించడం జరుగుతుంది.శక్తివంతమైన శివ మంత్రాలను పఠించడం ద్వారా కుటుంబ సమస్యలు, వ్యాధులు, ఇతర బాధలన్నీ దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.మరి ఆ మంత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శివ నమస్కార మంత్రన్ని ఇలా చదవాలి.ఓం నమః శంభవే ఛ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ|| ఓం ||
పంచాక్షరీ మంత్రం.ఓం నమః శివాయః
శివ నామావళి మంత్రం.శ్రీ శివాయ నమఃశ్రీ శంకరాయ నమఃశ్రీ మహేశ్వరాయ నమఃశ్రీ రుద్రాయ నమః శ్రీ ఓం పార్వతీ పతయే నమఃఓం నమో నీలకంఠాయ నమః
అలాగే మహా మృత్యుంజయ మంత్రం.
ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
శివ గాయత్రి మంత్రం. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నః శివః ప్రచోదయాత్॥
ఈ శివ మంత్రాల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సోమవారం రోజు ఈ శుభ మంత్రాలను పఠించడం ద్వారా అన్ని రకాల రోగాలు, దోషాలు, నష్ట కష్టాలు దూరమైపోతాయని ప్రజలు నమ్ముతారు.ఈ మంత్రాలను పాటించడం ద్వారా పితృ దోషం, కాలసర్ప దోషం, రాహువు, కేతు, శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మహామృతంజయ మంత్రాన్ని జపించడం కష్టంగా ఉన్నవారు, చిన్న మహా మృత్యుంజయ మంత్రం అని జపించాలి.అది నయం కానీ రోగాలను కూడా నయం చేస్తుంది.ఈ మంత్రాలను పఠించడం ద్వారా మోహము, క్రోధము, ద్వేషము, దురాశ, భయము, వ్యాకులత అన్ని నశిస్తాయి.ఈ మంత్రం మనిషిలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
LATEST NEWS - TELUGU