బ్యాంక్‌నే కొల్ల‌గొడుదామ‌నుకున్నారు ? ఊహించ‌ని ట్విస్ట్‌తో ఫ్యూజులు ఔట్ !

రోజురోజుకు దొంగ‌లు రెచ్చిపోతున్నారు.వారి విలాసాల‌కు అక్ర‌మ మార్గంలో డ‌బ్బులు సంపాదించేందుకు కొత్త‌కొత్త పంతాలు వెతుకుతున్నారు.

 Want To Rob A Bank Fuses Out With An Unexpected Twist , Latest Crime News , An-TeluguStop.com

మ‌హిళ‌ల మెడ‌లోంచి న‌గ‌లు దొంగిలించ‌డం, ఇంట్లో చొర‌బ‌డి బంగారం, డ‌బ్బు ఎత్తుకెళ్ల‌డం లాంటి ఘ‌ట‌న‌లు నిత్యం ఏదో ఒక చోట జ‌రుగుతూనే ఉన్నాయి. సైబ‌ర్ నేరాల గురించి అయితే చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇలాంటి త‌ర‌హా దొంగ‌త‌నాలు మ‌నం చూసి ఉంటాం.చివ‌రికి ఏటీంల‌ను దోచుకెళ్తున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి.

తాజాగా కుంభ‌స్థ‌లాన్నే కొట్టాల‌నుకున్న దుండ‌గులు ఏకంగా బ్యాంక్‌కే క‌న్న‌మేసేందుకు విఫల‌య‌త్నం చేశారు.ఇక్క‌డ ఓ ట్విస్ట్ రావ‌డంతో దుండ‌గులు షాక్ అయ్యారు.

వారి ఫ్యూజులు కొట్టేసినంత ప‌ని అయిపోయింది.అయితే ల‌క్ష‌లు, కోట్లు దొంగ‌త‌నాలు చేసిన దొంగ‌లు కూడా ఏదో ఒక కార‌ణంతో దొరికిపోతుంటారు.

ఏదైనా దుండ‌గులు ప‌డేసిన చిన్న వ‌స్తువు ఉంటే చాలు ప‌ట్టుబ‌డిపోతారు.ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

బ్యాంకు దోపిడీకి ప‌క‌డ్బందీ ఏర్పాటు చేసుకోగా బ్యాంకు అలారం చివ‌రినిమిషంలో మోగ‌డంతో అక్క‌డినుంచి దుండ‌గులు ప‌రార‌య్యారు.వివ‌రాల్లోకెళ్తే.

ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని పిరంగిపురం సొల‌స రోడ్డులో ఎస్‌బీఐ బ్యాంక్ ఉంది.గ‌త అర్ధ‌రాత్రి బ్యాంక్ చోరీకి దుండ‌గులు విఫ‌ల‌య‌త్నం చేశారు.బ్యాంక్ కిటికీని గ్యాస్ క‌ట్ట‌ర్‌తో తొల‌గించి దొంగ‌లు బ్యాంక్‌లోకి చొర‌బ‌డ్డారు.అంతా స‌వ్యంగానే ఉంద‌నుకున్నారు.

కాగా కొద్ది సేప‌టికే అలారం మోగింది.దీంతో దొంగ‌లు అప్రమత్తమై చోరీచేయ‌కుండా అక్క‌డినుంచి ప‌రార‌య్యారు.

విష‌యం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన బ్యాంక్ వ‌ద్ద‌కు చేరుకుని వివ‌రాలు సేక‌రించారు.దొంగ‌లు బ్యాంకులోకి చొర‌బ‌డిన విధానాన్ని ప‌రిశీలించారు.

ప‌క్కా స్కెచ్‌తోనే దొంగ‌లు ఈ దోపిడీకి విఫ‌ల‌య‌త్నం చేశార‌ని నిర్ధారించారు.అలారం మోగ‌కుంటే అందిన కాడికి దోచుకెళ్లే వార‌ని, మ‌రిన్నిభ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులు బ్యాంకు అధికారుల‌కు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube