మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో భారీ ఆఫర్స్..! మిస్ అవ్వద్దు..

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కురిసిన వానల దెబ్బకు రోడ్డుపై నడవాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.వాన దెబ్బకు పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నాయి.

 Hyderabad Metro Offers Great Deals For Travelers Do Not Miss  Metro Offers, Hyde-TeluguStop.com

దీంతో బయట రోడ్లమీద అడుగుపెట్టాలంటేనే భయబ్రాంతులకు లోనవుతున్నారు హైదరాబాద్ ప్రజలు.దీనికోసం మెట్రోలో ప్రయాణం చేసే చాలా బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు.

అయితే హైదరాబాద్ వాసులు ఈ విధంగా ఆలోచిస్తుంటే.హైదరాబాద్ మెట్రో వారు కూడా ప్రజల ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను తీసుకువస్తుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే…

హైదరాబాద్ మెట్రో సంస్థ దసరా పండుగ సందర్భంగా మెట్రో సువర్ణ ఆఫర్లను ప్రకటించింది ఈ ఆఫర్లు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంది ఇక ఈ ఆఫర్ లో భాగంగా టికెట్ చార్జెస్ లో 40 శాతం రాయితీని పొందవచ్చు.ఉదాహరణకు హైదరాబాద్ మెట్రో ఛార్జెస్ లో గరిష్టంగా 60 రూపాయలను కలెక్ట్ చేస్తుండగా ప్రస్తుతం ఆఫర్ లో భాగంగా కేవలం 36 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

ఇందులో భాగంగానే గరిష్ఠంగా 40 ట్రిప్స్ కు సరిపడే అమౌంట్ చెల్లించి 60 ట్రిప్స్ వరకు జర్నీ చేసుకోవచ్చు.

అలాగే ఎవరైతే ఎక్కువగా మెట్రో ప్రయాణం చేసేవారికి ఆన్లైన్ విధానం ద్వారా 400 నుంచి 1500 రూపాయల వరకు రీఛార్జ్ చేసుకుంటే అందులో వారికి 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఇకపోతే ఈ ఆఫర్ నవంబర్ 1 నుండి జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది.స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేసిన దగ్గర నుండి 30 రోజుల వరకు ఈ ఆఫర్ ను ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చు.

ఇందులో భాగంగా 20 ట్రిప్స్ గాను రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 30 ట్రిప్స్ ను ప్రయాణం చేయవచ్చు.కరోనా వైరస్ పరిస్థితి రాక ముందు ఎల్బీనగర్ నుండి మియాపూర్, జూబ్లి బస్టాండ్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టాండ్, నాగోల్ నుండి రాయదుర్గం వరకు ఉన్న వివిధ రూట్లలో ప్రతిరోజు మూడున్నర లక్షలకు పైగా మెట్రో ప్రయాణం చేసేవారు.

ఈ మధ్యకాలంలో కేవలం ఆ సంఖ్య 90 వేలకు పడిపోయింది.దీంతో ప్రజలను ఆకర్షించేందుకు మెట్రో ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube