కె.జి.యఫ్ రేంజ్ లో నిర్మించిన మరో కన్నడ చిత్రం భజరంగి 2 .. తెలుగులో 'జై భజరంగి' గా టీజర్ విడుదల

బాహుబలి సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ రావడంతో కన్నడ భాషలో నిర్మించిన ‘కె.జి.

 Built In The Range Of 2 To .. Bajrangi Kejiyaph English Kannada Film 'jai Bajran-TeluguStop.com

యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన కె.జి.యఫ్: చాప్టర్ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది.ఇండియన్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’.అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం ‘జై భజరంగి’.‘కరుండా చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషలలో లో ఒకే సారి విడుదలకు సిద్ధమౌతోంది.డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’ 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృటించింది.ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2′ అయితే తెలుగులో జై భజరంగి’ టైటిల్ తో విడుదల అవుతుంది.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ బాలాజీ వీడియో అధినేత నిరంజన్ పన్సారి ‘జై భజరంగి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి సంబందించిన టీజర్ సెప్టెంబర్ 11న శనివారం రాత్రి విడుదల అయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నా ప్రసిద్ధ సంస్థ ‘శ్రీ బాలాజీ వీడియో‘ ఇప్పటివరకు షుమారు 400 చిత్రాలకు పైగా వీడియో హక్కులను పొందివున్నాము.ఇప్పటివరకు మేమిచ్చే వీడియో నాణ్యత ను గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు.

తెలుగు లో మగధీర సినిమా తో బ్లూ రే డిస్క్ ని మా సంస్థ ద్వారా పరిచయం చేసాము.అదే విధంగా మేము స్థాపించిన ‘శ్రీ బాలాజీ మూవీస్‘ యు ట్యూబ్ ఛానల్ కూడా 1 కోటి 35 లక్షల వీక్షకులు కలిగి వున్నారు.

తాజాగా డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన జై భజరంగి’ చిత్రం తో టాలీవుడ్ నిర్మాణరంగం లోకి అడుగుపెట్టడం జరిగింది.2013 లో కన్నడ భాష లో విడుదలైన ‘భజరంగి’ శివ రాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం.ఆ సక్సెస్ ని పునస్కరించుకుని ప్రస్తుతం వున్నా ట్రెండ్ ప్రకారం ‘భజరంగి 2′ గత 2019 లో షూటింగ్ ప్రారంభించారు.

ఈ రెండేళ్ళు కరోనా క్రైసెస్ కారణంగా చిత్ర షూటింగ్ ఆలశ్యం అయింది.

భజరంగి చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో వుంది.టెక్నికల్ గా బాహుబలి, కె.జి.యఫ్ లకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మించడం వలన మంచి ఫాన్సీ రేట్ తో ‘జై భజరంగి’ తెలుగు లో విడుదల చేయడానికి శ్రీ బాలాజీ వీడియో సంస్థ నిర్మాణ రంగం లోకి రావడం జరిగింది.ఈ సందర్భంగా నిన్నటి రోజున టీజర్ కూడా విడుదల చేసాము.కన్నడ తెలుగు భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము” అన్నారు.

నటీనటులు:

డా.శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్: శ్రీ బాలాజీ వీడియో సంగీతం : అర్జున్ జన్య, సినిమాటోగ్రఫర్: స్వామి జె.గౌడ, ఎడిటర్: దీపు యస్ కుమార్,కాస్ట్యూమ్స్ :యోగి జి.రాజ్ ఫైట్స్:డా.రవి వర్మ, విక్రమ్ మోర్, ఆర్ట్ డైరెక్టర్: రవి శాంతే హక్కులూ, మాటలు :ఏ.సెల్వమ్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రేమ్ కుమార్, నిర్మాత: నిరంజన్ పన్సారి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ.హర్ష

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube