వైరల్: ఇలాంటి హోటల్ ని ఎప్పుడైనా చూసారా..?!

మన అనంత విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.విశ్వంలోని భూగ్రహం మీద కూడా మనకు తెలియని ఎన్నో వింతలు దాగి ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

 Ice Hotel Sweden, Worlds Famous Ice Hotel, Ice Hotel Photos, Viral News, Sweden,-TeluguStop.com

టెక్నాలజీ పెరిగిన కారణంగా ప్రజలు ఎన్నో రకాల వింత వింత అద్భుతాలను సృష్టిస్తూ ప్రజలను అబ్బుర పరుస్తున్నారు.కళ్లతో నేరుగా చూస్తున్న ఇది నిజమా.? అబద్దమా.? అన్నట్లుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు.ఇందుకు తార్కాణంగా స్వీడన్ దేశంలో కొందరు అద్భుతాన్ని సృష్టించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
స్వీడన్ లో మొట్టమొదటిసారిగా 1992 లోని తొలి ఐస్ హోటల్ మొదలైంది.ఆ హోటల్ లోని భాగాలు పూర్తిగా ఐస్ తోనే చేసి ఉండడం నిజంగా అబ్బుర పరిచే విషయం.

ఈ ఫోటో లోని భాగాలు కరిగిపోకుండా 2016 నుండి సోలార్ పవర్ అండ్ కూలింగ్ ప్రక్రియను ఆ హోటల్ నిర్వాహకులు ఉపయోగిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఈ హోటల్ ను సందర్శించడానికి లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.

ఈ ఐస్ హోటల్ లో లివింగ్ ఓషన్ షూట్ ఎంతో ప్రత్యేకమైనది.దానిని చూస్తే ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

స్వీడన్ దేశంలోని జుక్కాస్​ జార్వి అనే ప్రాంతంలో ఈ హోటల్ ను నిర్మించారు.

ఈ హోటల్ లో మొత్తం కూల్, వేడి బెడ్స్ దాదాపు 150 వరకు ఉంటాయి.వీటితో పాటు ఆ ఐస్ హోటల్ లో మంచు శిల్పాలు, స్టూడియో, ఐస్ బార్, ఓ చర్చి, నాలుగు మీటింగ్ రూమ్స్, 100 మంది కలిసి పార్టీ చేసుకునేలా పెద్ద హాల్ లాంటివి చూసేందుకు అబ్బురపరుస్తాయి.వీటితోపాటు ఈ హోటల్ లో ఉన్న ఫర్నిచర్ గోడలు వారు ఇలా అన్నింటిని ఐస్ తోనే నిర్మించడం ఆశ్చర్యం గొలిపే విషయం.

అయితే ఈ ఐస్ హోటల్ ను కేవలం పర్యాటకుల కొరకు శీతాకాలంలోనే నిర్మిస్తారు.డిసెంబర్ నుండి ఏప్రిల్ మధ్య ప్రాంతంలో మాత్రమే ఈ హోటల్ మనకు కనబడుతుంది.

ఆ తర్వాత నుండి ఈ ప్రాంతం మొత్తం నదిలా మారిపోతుంది.వినడానికి తమాషాగా ఉన్నా ఇది మాత్రం నిజం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube