అలా జరిగి ఉంటే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పేదా.. వాళ్ల నిర్లక్ష్యమే కారణమా?

కోరమాండల్ ఎక్స్ ప్రెస్( Coromandel Express ) రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృతి చెందారు.అమాయకుల ప్రాణాలు పోవడంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Shocking Facts About Koramandal Express Incident  Details Here Goes Viral In Soc-TeluguStop.com

రైళ్లలో ప్రయాణం చేస్తే ఎలాంటి సమస్య ఉండదని భావించేవాళ్లు ఈ ఘటనతో రైళ్లలో ప్రయాణించాలంటే టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది.అయితే ఈ ప్రమాదానికి రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రైలు ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ ( Railways )నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రైళ్లు పరస్పరం ఢీకొనకుండా కవచ్ అనే టెక్నాలజీ ఉండగా కీలక రైల్వే లైన్ అయిన హౌరా( Howrah ) చెన్నై మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు.

ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉన్నా పనులు మాత్రం ముందుకు సాగలేదు.కవచ్ పరిజ్ఞానాన్ని( Kavach ) ఏర్పాటు చేయడానికి కిలో మీటర్ కు 50 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి./br>

ఈ స్థాయిలో ఖర్చు చేయాలంటే రైల్వేపై ఊహించని స్థాయిలో భారం పడుతుంది.కవచ్ టెక్నాలజీలో భాగంగా రైళ్లలో ప్రత్యేక కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు.రైళ్ల కదలికలను అప్ డేట్ చేయాలనే సూత్రంపై ఇది పని చేస్తుంది.ఈ టెక్నాలజీ సిగ్నల్ జంప్ ను అప్రమత్తం చేయడంతో పాటు అదే లైన్ లో ఇంకో రైలు ఉంటే ఆటోమేటిక్ గా రైలును ఆపేస్తుంది./br>

మంచు కమ్ముకుంటే లైన్ సైడ్ సిగ్నల్స్ ఇవ్వడంతో పాటు లెవెల్ క్రాసింగ్స్ దగ్గర విజిల్స్ వేస్తుంది.రైలు నియంత్రణను కోల్పోతే హెచ్చరికల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది.రైలు బ్రేకులు ఫెయిల్ యిన సమయంలో కూడా ఈ వ్యవస్థ ద్వారా రైలును నిలిపివేయవచ్చు.కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రయాణం చేసిన రూట్ లో కవచ్ వ్యవస్థ అమలులో ఉండి ఉంటే రైలు ప్రమాదం జరిగేది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube