సత్ఫలితాలను ఇస్తున్న మేకిన్ ఇండియా.. పెరిగిన బొమ్మల ఎగుమతులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం వల్ల దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది.గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

 Make In India Giving Good Results Increased Toy Exports Details, Make In India,-TeluguStop.com

టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ 13వ ఎడిషన్ సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) అడిషనల్ సెక్రటరీ అనిల్ అగర్వాల్ పలు కీలక విషయాలను వెల్లడించారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పిల్లల కోసం తయారు చేసే బొమ్మలను కొత్త విషయాలు నేర్చుకునేవిగా ఉపయోగించడం, దేశీయ డిజైన్‌ను బలోపేతం చేయడానికి దేశీయ బొమ్మల తయారీ ఉపయోగపడుతుందని అనిల్ అగర్వాల్ తెలిపారు.

బొమ్మల కోసం ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

భారతీయ విలువలు, చరిత్ర, సంస్కృతి ఆధారంగా బొమ్మల రూపకల్పన చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల బొమ్మల తయారీ పరిశ్రమ లబ్ది పొందిందని, మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం విజయవంతమైందని ఆయన అన్నారు.

టాయ్ సెక్టార్‌లో మేక్-ఇన్-ఇండియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) సర్టిఫికేషన్, నాణ్యత పరీక్ష, కస్టమ్స్ సుంకం పెంపుదల వంటివి ఉన్నాయి.

Telugu Dolls, Dpiitanil, India Toys, India, Prime Modi, Ratee, Toybizz, Toy, Lat

ఫిబ్రవరి 2020లో, ప్రభుత్వం బొమ్మలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుండి 60 శాతానికి పెంచింది.క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం, ప్రతి బొమ్మ సంబంధిత భారతీయ ప్రమాణాల అవసరాలకు అనుగుణంగా ఉండాలి.దేశీయ తయారీదారులకు బొమ్మల భద్రతకు 843 లైసెన్సులను మంజూరు చేసింది.

వీటిలో 645 నాన్-ఎలక్ట్రిక్ బొమ్మలకు, 198 లైసెన్సులు ఎలక్ట్రిక్ బొమ్మలకు మంజూరు చేయబడ్డాయి.దీంతో పాటు అంతర్జాతీయ బొమ్మల తయారీదారులకు ఆరు లైసెన్సులు మంజూరు చేశారు.

ఫలితంగా దేశీయంగా బొమ్మల తయారీ పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube